Category: మేడ్చల్-మల్కాజ్‌గిరి

ప్రజావాణిలోఫిర్యాదుతో పార్కును కాపాడిన హైడ్రా

ప్ర‌జావాణిలో వ‌చ్చిన ఫిర్యాదుల‌ను వెనువెంట‌నే ప‌రిష్క‌రించేందుకు హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలో  ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి పార్క‌లు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలతో పాటు చెరువును హైడ్రా కాపాడుతున్నారు. వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అన్నోజిగూడ గ్రామంలోని సర్వే నంబర్లు 94, 95లో ఉన్న 3,400 చదరపు గజాల ప్రజావసరాల స్థలాన్ని హైడ్రా అధికారులు పరిరక్షించారు. ఈ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ అందిన ఫిర్యాదుల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో…

మహిళల వేధింపులపై షీ టీమ్స్ ఉక్కుపాదం

 మహిళలు, బాలికల వేధింపులపై జీరో టాలరెన్స్ విధానంతో చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ తెలిపారు. 2026 అక్టోబర్‌లో షీ టీమ్స్ నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్లలో 206 మంది పట్టుబడ్డారు. మొత్తం 220 ఫిర్యాదులు అందగా, 61 ఫోన్ వేధింపులు, 70 సోషల్ మీడియా వేధింపులు, 89 ప్రత్యక్ష వేధింపులకు సంబంధించినవి ఉన్నాయి. వీటిపై 14 క్రిమినల్ కేసులు, 106 పెట్టీ కేసులు నమోదు చేశారు. మరో 96 మందికి ఎల్బీనగర్ పోలీస్ కమిషనర్…

ఫాక్స్ సాగర్ బాధితులను పరామర్శించిన ఈటల రాజేందర్..

దూలపల్లి గ్రామ పరిధిలోని 121, 124, 125 మరియు 126 సర్వే నంబర్ పరిధిలో,  1995 సంవత్సరంలో చేసిన శ్రీ వెంకటేశ్వర కాలనీ వెంచర్ మరియు ఇతర ప్లాట్లను ఫాక్స్ సాగర్ బఫర్ జొనులో ఉందని హైడ్రా ఆపాదిస్తూ అక్కడి నిర్మాణాలను మరియు రోడ్లను తొలగించి ఫాక్స్ సాగర్ సుందరీకరణ పనులు చేపట్టారు. దీనికి నిరసనగా ప్లాట్ల యజమానులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని బాధితులకు అండగా నిలిచారు. ఈ…

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలి

 చింతల్‌లోని భాగ్యరధి డిగ్రీ కళాశాలలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘నషా ముక్త యువ – నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జీడిమెట్ల ఎస్‌ఐ గంగాధర్ మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్‌ విక్రయాలు, వినియోగంపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రిన్సిపాల్ నవీన్ రాజ్ విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. సామాజిక కార్యకర్త…

భూముల విక్రయంపై నిరసనగా భారీ ధర్నా

ప్రజా అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములను విక్రయించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వం వెంటనే భూముల వేలాన్ని నిలిపివేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, శంబిపూర్ రాజు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు…

ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల రెండోరోజు ధర్నా

 ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత 20 ఏళ్లుగా శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట రెండోరోజు ధర్నా నిర్వహించారు. గత ప్రభుత్వాలు కార్మికులకు వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చినా అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికులను పర్మినెంట్ చేసి, వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన…

జగద్గిరిగుట్టలో నీటి వృథా.. ఆపేవారేరి? పట్టించుకునేవారేరీ?

జగద్గిరిగుట్ట చౌరస్తా వద్ద నడిరోడ్డుపై తాగునీరు వృథాగా పారుతోంది. విలువైన నీరు ఇలా రోడ్డుపైకి చేరి వృథా అవుతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అందుబాటులో ఉన్న నీరు ఇలా వృథా కావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పైపులైన్ లీకేజీనా? లేక అధికారుల పర్యవేక్షణ లోపమా? అన్నది తేలాల్సి ఉంది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను…

దుండిగల్ సర్కిల్లో విస్తృత తనిఖీలు

 దుండిగల్ సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి, మౌలిక వసతులు, పారిశుద్ధ్య కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు జోనల్ కమిషనర్ శుక్రవారం విస్తృతంగా క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. ఈ పర్యటనలో డిప్యూటీ కమిషనర్ (డీసీ), ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ), డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ), ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా దుండిగల్ క్రికెట్ స్టేడియంలో కొనసాగుతున్న నిర్మాణ, మౌలిక వసతుల పనులను పరిశీలించి, వాటి పురోగతి, గడువులపై సమీక్షించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా వేగం పెంచాలని…

ఖైత‌లాపూర్ చెరువును కాపాడిన హైడ్రా

 మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా కూక‌ట్‌ప‌ల్లి మండ‌లం ఖైత‌లాపూర్ గ్రామంలోని ఖైత‌లాపూర్ చెరువును హైడ్రా అధికారులు. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలోని 9.06 ఎక‌రాల భూమి క‌బ్జాల‌కు గురి కాకుండా చెరువు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఫెన్సింగ్ వేయ‌డంలో భాగంగా.. పొద‌లలో క‌నిపించ కుండా ఉన్న స‌మాధి రాయి జేసీబీకి త‌గిలి తొల‌గ‌డంతో స్వ‌ల్ప ఉద్రిక్త‌త ఏర్ప‌డింది. ముళ్ల పొద‌ల‌ను జేసీబీతో తొల‌గించే క్ర‌మంలో స‌మాధిగా గుర్తించేందుకు ఉద్దేశించి పాతిన రాయి తొల‌గ‌డంతో ఈ ఇబ్బంది ఏర్ప‌డింది….

పీఆర్‌టీ కారిడార్లు.. ఏడాదిలో తొలి దశ పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపడంతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించి, వాయు కాలుష్యాన్ని నియంత్రించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. కోర్ అర్బన్ ఏరియా (క్యూర్‌) పరిధిలోని ప్రధాన మార్గాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (పీఆర్‌టీ) వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో పీఆర్‌టీ విధానంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తొలిదశలో అత్యంత రద్దీగా ఉండే కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా…