జగద్గిరిగుట్టలో నీటి వృథా.. ఆపేవారేరి? పట్టించుకునేవారేరీ?

  • జగద్గిరిగుట్ట చౌరస్తా వద్ద నడిరోడ్డుపై తాగునీరు వృథాగా పారుతోంది. విలువైన నీరు ఇలా రోడ్డుపైకి చేరి వృథా అవుతున్నా సంబంధిత అధికారుల్లో చలనం లేకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అందుబాటులో ఉన్న నీరు ఇలా వృథా కావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పైపులైన్ లీకేజీనా? లేక అధికారుల పర్యవేక్షణ లోపమా? అన్నది తేలాల్సి ఉంది. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి లీకేజీని అరికట్టి నీటి వృథాను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.

You may also like...