Category: మేడ్చల్-మల్కాజ్‌గిరి

కొత్తగా 4,63,857 మందికి చేయూత పింఛన్లు మంజూరు

కూకట్‌పల్లి: గత బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా అర్హులను ఇబ్బందులకు గురిచేశారని కాంగ్రెస్‌ పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఎస్సీ విభాగం చైర్మన్‌ మట్టే ప్రసన్నకుమార్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా 4,63,857 మందికి చేయూత పింఛన్లు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. వీరిలో 2,77,894 మంది వితంతువులు, 1,00,224 మంది దివ్యాంగులు, 53,844 మంది ఒంటరి మహిళలు, ఇతర వృత్తిదారులు ఉన్నారని తెలిపారు. పేదల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, మంత్రి…

రాజీవ్ గృహకల్ప స్థలంలో యేదేచ్ఛగా భూకబ్జాలు

జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట డివిజన్‌లోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని సంక్షేమ సంఘం సలహాదారు నరసింహారెడ్డి ఆరోపించారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా, వాటర్ ట్యాంక్ పక్కన రాత్రికి రాత్రే డబ్బాలు ఏర్పాటు చేసి, వెనుక పిల్లర్లతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. గతంలో 24 ఎకరాల 78 సెంట్లలో 104 బ్లాకులకు ప్రణాళిక రూపొందించగా, 54 బ్లాకులు నిర్మించి 1,779 నిరుపేద కుటుంబాలకు ఇళ్లు పంపిణీ చేశారని వివరించారు. మిగిలిన స్థలాలను ఆటస్థలాలు, ఆలయం,…

అక్రమ ఆహార తయారీ కేంద్రాలపై ఎస్‌ఓటీ దాడులు

మేడ్చల్: ప్రజారోగ్యానికి హాని కలిగించే అక్రమ ఆహార తయారీ కేంద్రాలపై మల్కాజిగిరి ఎస్‌ఓటీ జోన్‌-1 బృందం కొరడా ఝళిపించింది. కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెండు యూనిట్లపై దాడులు నిర్వహించింది. శ్రీ కర్ణి మాత నమ్కీన్ ఫుడ్ చిప్స్ యూనిట్‌లో అపరిశుభ్ర వాతావరణంలో, తయారీ, గడువు తేదీల వివరాలు లేకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించింది. వసంత్‌నాథ్ ఎంటర్‌ప్రైజెస్‌లో అనుమతులు లేకుండా కోళ్ల, చేపల మేత తయారీతో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాల వ్యవహారాలు వెలుగులోకి…

రోడ్డు భద్రతపై, మాదకద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

ఘట్‌కేసర్: విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని ఘట్‌కేసర్ పోలీసులు పిలుపునిచ్చారు. ఘట్‌కేసర్‌లోని రిషి పాఠశాలలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 200 మంది విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అపరిచితులు ఇచ్చే తినుబండారాలను స్వీకరించవద్దని, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, వాటి నిర్మూలనకు కృషి చేస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత…

సైబర్ నేరాలపై సైబరాబాద్ పోలీసుల కొరడా.. 25 మంది అరెస్ట్

సైబరాబాద్‌: సైబర్ నేరాలపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి నవంబర్ 11 నుంచి 18 వరకు 10 కేసులను ఛేదించి వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది నిందితులను అరెస్టు చేశారు. వీటిలో సైబర్ మోసాలు 2, పార్ట్‌టైమ్ ఉద్యోగ మోసాలు 2, ట్రేడింగ్ మోసాలు 3, స్మిషింగ్ మోసాలు 2, డిజిటల్ అరెస్ట్ కేసు ఒకటి ఉన్నాయి. బాధితులకు 38 కేసుల్లో రూ.78,62,961 తిరిగి చెల్లించేందుకు 59 రీఫండ్ ఆర్డర్లు పొందారు….

ప్రగతి నగర్ అంబిర్ చెరువు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.. హైడ్రా కమిషనర్

ప్రగతినగర్: అంబీర్ చెరువును పర్యావరణహితంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. శుక్రవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. 162 ఎకరాల విస్తీర్ణమున్న చెరువును ఆక్రమణల తొలగింపుతో 135.8 ఎకరాలకు విస్తరిస్తామన్నారు. పూడిక, వ్యర్థాలు తొలగించి, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆటస్థలాలు, బోటింగ్, స్కై వాక్ ఏర్పాటు చేస్తామన్నారు. వరద నియంత్రణ, భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో…

హాస్టళ్లలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి

మేడ్చల్: ప్రభుత్వ గురుకుల, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన పౌష్టికాహారం అందించాలని బీఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. పురుగుల అన్నం, నాణ్యతలేని కూరగాయలు, కలుషిత నీటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో నిరంతర తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుతో రాజీపడరాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు విజయరాజ్, ఉపాధ్యక్షుడు కొండా…

సైబరాబాద్ మూవ్స్–2026’ పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

సైబరాబాద్: నగర రవాణా వ్యవస్థను సురక్షితంగా, సమర్థవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, నిపుణులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నవంబర్ 26 నుంచి 28 వరకు హైదరాబాద్ టీ-హబ్‌లో నిర్వహించనున్న మూడు రోజుల ‘సైబరాబాద్ మూవ్స్–2026’ సదస్సు పోస్టర్‌ను బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, సైబరాబాద్ సీపీ ఎం. రమేష్, మున్సిపల్ కమిషనర్ జి. సృజన తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి 74 కీలక జంక్షన్ల అభివృద్ధితో…

కూకట్‌పల్లి నియోజకవర్గంలో 4,092 మందికి కొత్త పెన్షన్లు

కూకట్‌పల్లి: నియోజకవర్గ పరిధిలో కొత్తగా 4,092 మంది లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరయ్యాయి. సర్కిళ్ల వారీగా కూకట్‌పల్లిలో 705, మూసాపేటలో 2,179, ఓల్డ్ బోయిన్‌పల్లిలో 1,208 మందిని ఎంపిక చేశారు. అర్హులైన వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జి బండి రమేష్ తెలిపారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

విద్యాసంస్థలతో వర్చువల్ సమావేశం

సైబరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన సైబరాబాద్ మూవ్స్–2026లో 400కు పైగా విద్యాసంస్థలకు చెందిన సుమారు 3.5 లక్షల మంది విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్, మున్సిపల్ కమిషనర్ డా. జి. సృజన విద్యాసంస్థలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ఆలోచనలకు ప్రాధాన్యమిస్తూ ఇన్నోవేషన్ ఛాలెంజ్ చేపడుతున్నారు. నవంబర్ 20 దరఖాస్తులకు చివరి తేదీ. నవంబర్ 26 నుంచి 28 వరకు టీ-హబ్‌లో…