రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) ప్రగతినగర్: అంబీర్ చెరువును పర్యావరణహితంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. శుక్రవారం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో కలిసి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. 162 ఎకరాల విస్తీర్ణమున్న చెరువును ఆక్రమణల తొలగింపుతో 135.8 ఎకరాలకు విస్తరిస్తామన్నారు. పూడిక, వ్యర్థాలు తొలగించి, వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ జిమ్‌లు, పిల్లల ఆటస్థలాలు, బోటింగ్, స్కై వాక్ ఏర్పాటు చేస్తామన్నారు. వరద నియంత్రణ, భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్‌కుమార్, ఏసీపీ పి. తిరుమల్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే హైడ్రా పనులకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.
