సైబర్ నేరాలపై సైబరాబాద్ పోలీసుల కొరడా.. 25 మంది అరెస్ట్

సైబరాబాద్‌: సైబర్ నేరాలపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి నవంబర్ 11 నుంచి 18 వరకు 10 కేసులను ఛేదించి వివిధ రాష్ట్రాలకు చెందిన 25 మంది నిందితులను అరెస్టు చేశారు. వీటిలో సైబర్ మోసాలు 2, పార్ట్‌టైమ్ ఉద్యోగ మోసాలు 2, ట్రేడింగ్ మోసాలు 3, స్మిషింగ్ మోసాలు 2, డిజిటల్ అరెస్ట్ కేసు ఒకటి ఉన్నాయి. బాధితులకు 38 కేసుల్లో రూ.78,62,961 తిరిగి చెల్లించేందుకు 59 రీఫండ్ ఆర్డర్లు పొందారు. ఏసీబీ అధికారులమంటూ ప్రభుత్వ ఇంజినీర్‌ను బెదిరించి రూ.10 లక్షలు కాజేసిన ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. ప్రజలు అపరిచితుల బెదిరింపు కాల్స్‌కు భయపడి డబ్బులు బదిలీ చేయవద్దని డీసీపీ కె. పుష్ప హెచ్చరించారు.

You may also like...