Category: మేడ్చల్-మల్కాజ్‌గిరి
తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన రాష్ట్ర కమిటీ, 22 జిల్లాల అధ్యక్షుల ప్రకటనహైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ నూతన రాష్ట్ర కమిటీతో పాటు 22 జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తూ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ ప్రకటన విడుదల చేశారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి అల్కా లంబా ఆమోదంతో ఈ నూతన కమిటీని ప్రకటించారు.రాష్ట్రవ్యాప్తంగా మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడం, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని విస్తరించడం,…
*రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష.. రూ.2 వేల జరిమానా విధించిన హైకోర్టు**పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నాలుగు వారాల పాటు శిక్ష నిలిపివేత* హైకోర్టు ఆదేశాలను అమలు చేయని వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో జరిగిన జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.వివరాల్లోకి వెళ్తే.. నిషేధిత…
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి.. ఇంట్లో చోరీ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి ఆర్థిక అవసరాల కోసం ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లోని శిల్పా వ్యాలీ సారా ప్రైడ్ అపార్ట్‌మెంట్‌లో ఈ నెల 2న రాత్రి టెర్రస్ నుంచి తాడు సహాయంతో బాల్కనీలోకి ప్రవేశించి 35 తులాల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలను దొంగిలించాడు. కేసు దర్యాప్తులో భాగంగా నవంబర్ 8న గచ్చిబౌలి ఎక్స్‌రోడ్స్ వద్ద నిందితుడు…
కీసర పోలీస్ స్టేషన్‌లో మరో అవినీతి కలకలం.. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ అరెస్ట్!ఒకే పోలీస్ స్టేషన్‌లో వరుసగా లంచం కేసులు.. మారని అవినీతి తీరుకీసర: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర పోలీస్ స్టేషన్ మరోసారి అవినీతి ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎస్‌ఐ శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. పోలీస్ శాఖలో మరోసారి లంచం వ్యవహారం వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళ్తే…..
ఇందిరమ్మ ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి వేడుకలుదీపావళి పర్వదినం, జన్మదినం ఒకేసారి రావడంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొడంగల్ మండలం పర్సాపూర్ గ్రామంలో ప్రత్యేకంగా పండుగ జరుపుకున్నారు. గ్రామానికి చెందిన గోరిపల్లి సుమిత్ర, శ్రీనివాస్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి, వారి ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం స్వీకరించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి భోజనం…
జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే క్లబ్‌లో ఘనంగా దీపావళి వేడుకలుహైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే క్లబ్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు తదితర ప్రముఖులు పాల్గొని వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నాయకులు పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటూ సోదరభావం, ఐక్యత, సంతోషం వెల్లివిరిసేలా వేడుకల్లో భాగస్వాములయ్యారు.
ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆరుతడి పంటలు సాగు చేయాలి: సీఎం రేవంత్ రెడ్డివికారాబాద్ జిల్లా, ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు తగ్గి, ఎండలు తీవ్రంగా ఉండే అవకాశమున్నందున రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలు సాగు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో నిర్వహించిన మెగా రైతు మేళా, పారిశ్రామిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. వచ్చే ఎనిమిది నెలలు అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. రైతులకు ప్రభుత్వం…
కొడంగల్‌లో ఇండస్ట్రియల్ హబ్‌కు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారంకొడంగల్‌ను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE)లో భాగంగా హకీంపేటలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రదర్శనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 943.34 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేయనున్న ఈ హబ్ ద్వారా పరిశ్రమలు, పెట్టుబడులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించనున్నారు. భూసేకరణకు రూ.220 కోట్లు, మౌలిక వసతుల కల్పనకు రూ.441.91 కోట్లు కేటాయించారు. ఇప్పటికే బిర్లాను లిమిటెడ్, ఎకోపామ్ సంస్థలకు 96…
ఓటరు జాబితా సమగ్ర సవరణపై కలెక్టర్లతో సీఈఓ వీడియో కాన్ఫరెన్స్రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి. సుదర్శన్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటరు జాబితా సవరణకు సంబంధించిన విధివిధానాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలు, అధికారుల బాధ్యతలు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్…
సదర్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా బేరి రామచందర్ యాదవ్‌కు ఆహ్వానంహైదరాబాద్, రాయదుర్గం యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదర్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్‌ను గోకుల్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దానబోయిన రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి నాగపురి అశోక్ యాదవ్, నాగపురి శ్యామ్ యాదవ్, దానబోయిన దినేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ఈ మహోత్సవానికి ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వల్లాల నవీన్ యాదవ్,…