Category: తెలంగాణ

కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నాగిళ్ల శివరాజ్

వెల్దండ అక్టోబర్ 24 :బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను బీఆర్ఎస్వీ వెల్దండ మండల అధ్యక్షుడు నాగిళ్ల శివరాజ్ శనివారం తెలంగాణ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కేటీఆర్ సూచించినట్లు నాగిళ్ల శివరాజ్ తెలిపారు.

ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు అవగాహన సదస్సు

వెల్దండ: మండలంలో ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటు నమోదు అవగాహన సదస్సును నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యుడు దొబ్బల భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పుట్ట రాంరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పుట్ట రాంరెడ్డి మాట్లాడుతూ అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నిరంజన్, అశోక్, శేఖర్‌తో పాటు ఆర్‌ఎస్‌పీ ఫౌండేషన్ సభ్యులు బండగల్ల చందు, కొమ్ము…

హన్మాజీపేట్ చెరువులో యువకుడి మృతదేహం లభ్యం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామానికి చెందిన చాకలి గుమ్మడి కాశీరాం (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గ్రామ సమీపంలోని పాత చెరువు తూము వద్ద అతడి మృతదేహాన్ని రైతులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామ సర్పంచ్ ఆశగోని లావణ్య వెంకట్ గౌడ్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. కాశీరాం మృతికి కారణాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ఆరుతడి పంటలే మేలు!

ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉన్నందున యాసంగిలో రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేయాలని బాన్సువాడ ఆర్డీఓ అడ్లా రవీందర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్‌, మంజీరా జలాలు, చెరువుల నీటిపై ఆధారపడే రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండాలన్నారు.జొన్న, శనగ, పొద్దుతిరుగుడు, కుసుమ వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని వ్యవసాయ అధికారులు సూచించారు. చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లో అనధికారికంగా మోటార్లు ఏర్పాటు చేసి…

సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ‘సరాకా’ పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన.

సరాకా’ పరిశ్రమలో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

బైక్‌ను ఢీకొట్టిన ఆటో.. పంచాయతీ కార్యదర్శికి తీవ్ర గాయాలు

బైక్‌ను ఢీకొట్టిన ఆటో.. పంచాయతీ కార్యదర్శికి తీవ్ర గాయాలుఆమనగల్లు: ఖానాపూర్‌ పలుగుగుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెల్జాల్‌ గ్రామపంచాయతీ కార్యదర్శి వాజీద్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆమనగల్లు నుంచి వెల్జాల్‌కు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఆయన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాజీద్‌కు తల, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి.సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వాజీద్‌ను ఎన్నం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడికి సర్పంచ్ పరామర్శ

వెల్దండ:రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెల్దండ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బాదేపల్లి రామకృష్ణను స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ శుక్రవారం పరామర్శించారు. రామకృష్ణ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే యెన్నమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా రామకృష్ణకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు….

జల్లపల్లిలో ఐకేపీ భవనం ప్రారంభం

 బాన్సువాడ:పోతంగల్ మండలం జల్లపల్లి ఆబాది గ్రామంలో నూతనంగా నిర్మించిన ఐకేపీ మహిళా మండలి భవనాన్ని ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం శ్రీ జగదాంబ సేవాలాల్ మహారాజ్ నాలుగో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళా సంఘాల బలోపేతానికి, మహిళల ఆర్థిక అభివృద్ధికి ఐకేపీ భవనం ఉపయోగపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సుల్తానా గౌస్, సర్పంచ్ బర్మావత్ వివేక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు…

అమెరికాలో రచయిత మిట్టపల్లి సురేందర్ కి ఘన స్వాగతం

అమెరికాలో  రచయిత మిట్టపల్లి సురేందర్ కి ఘన స్వాగతం ​అమెరికాలో స్థిరపడ్డ తెలుగువారు నిర్వహించిన  ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా తెలంగాణ జానపద సినీ గేయ రచయిత గాయకులు అయిన మిట్టపల్లి సురేందర్ కు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మిట్టపల్లి సురేందర్ దుబాయిలో బతుకమ్మ అనే పాట  ఎడారి బ్రతుకుల కష్టాలను ప్రతిబింబిస్తూ ఆయన అందించిన బతుకమ్మ పాట  విశేష స్పందన తెచ్చుకుంది దానిని గుర్తు చేస్తూ  మర్యాదపూర్వకంగా శాలువలతో స్వాగతం పలికా. ప్రముఖ…