గ్రామదేవతలను పూజించడం మన సంప్రదాయం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

గ్రామదేవతలను పూజించడం మన సంప్రదాయం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 25 : గ్రామదేవతలను పూజించడం మన సంప్రదాయమని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎ ఎస్ నాయకులు పెద్ది బాలనర్సయ్యగౌడ్ తన వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన ఉప్పలమ్మ తల్లి పండులో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దైవభక్తితో మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుందన్నారు. గ్రామదేవతల పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకని ఇలాంటి వేడుకలు ప్రజల్లో ఐకత్యను, ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తరాల బలరాములు, మాజీ వైస్ ఎంపీపీ గడుసు కోటిరెడ్డి, పామనుగుండ్ల సర్పంచ్ వడ్డె సైదిరెడ్డి, నాయకులు పోగుల నర్సింహ్మ, గుండగోని రాములు, బీరెల్లి ప్రసాద్, అంతటి శ్రీనివాస్, పనస సైదులు, ఎడ్ల పురుషోత్తం రెడ్డి మంగదుడ్ల వెంకన్న, పెద్ది మల్లేష్ గౌడ్, కొంపెల్లి సైదులు, తదితరులు పాల్గొన్నారు.1000391473.jpg

You may also like...