ఆధునిక సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి : వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్
- ఆధునిక సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి : వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్ - October 25, 2026
- గ్రామదేవతలను పూజించడం మన సంప్రదాయం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య - October 25, 2026
- పోలీసులంటే భయం కాదు.. భరోసా : కట్టంగూర్ ఎస్ఐ మునుగోటి రవీందర్ - October 24, 2026
ఆధునిక సాంకేతికతతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి : వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్రమోహన్
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, అక్టోబర్ 25: ఆధునిక సాంకేతికతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి కడవేరు సురేంద్రమోహన్ అన్నారు. ఆదివారం మండలంలోని అయిటిపాముల జిపి పరిధిలో గల గంగాదేవి గూడెంలోని కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రైతుల అభ్యున్నతి, వ్యవసాయ అభివృద్ధి కోసం కట్టంగూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై శిక్షణ అందించడంతోపాటు వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, మహిళా సాధికారతకు ప్రాధాన్యమివ్వడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. రైతులకు వివిధ రంగాల్లో శిక్షణ అందించేందుకు సంస్థ ముందుకు రావడం సంతోషకరమన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్పీఓలు) మరింత బలోపేతమైతే రైతులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. అనంతరం సత్య శక్తి ఆధ్వర్యంలో రైతులకు ద్విచక్ర వాహన రుణాలను పంపిణీ చేసి డిజిటల్ రూమ్స్ ను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వినోద్ కుమార్, సహాయ వ్యవసాయ సంచాలకులు నకిరేకల్ విజయేందర్ రెడ్డి, అసిస్టెంట్ రిజిస్టర్ విజయ్, నాగేశ్వరరావు, తాసిల్దార్ పుష్పలత, ఎంపీడీవో అంజిరెడ్డి, ఏవో ఎడవల్లి గిరిప్రసాద్ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి, ఎఫ్ పీఓ చైర్మన్ సైదమ్మ తదితరులు పాల్గొన్నారు
