స్వేరోస్ సీనియర్ నాయకుడు జగన్‌కు పితృవియోగం

జ్ఞాన తెలంగాణ, అక్టోబర్ 25: స్వేరోస్ సీనియర్ నాయకుడు జగన్ తండ్రి మైలారం యాదయ్య మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణవార్తతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్వేరోస్ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. యాదయ్య మృతి జగన్ కుటుంబానికే కాకుండా ఆయనతో అనుబంధం ఉన్న వారందరికీ తీరని లోటు అని పలువురు పేర్కొన్నారు. మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. మైలారం యాదయ్య అంత్యక్రియలు రేపు (అక్టోబర్ 26) వారి స్వగృహంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

You may also like...