బీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత భార్గవ్ దేశ్‌పాండే

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ :
ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ చేపడుతున్న పోరాటాలకు ఆకర్షితులై కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరుతున్నారని బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. భార్గవ్ దేశ్‌పాండే చేరికతో ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కార్యకలాపాలకు మరింత ఊతం లభిస్తుందని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...