వెల్దండ బీజేవైఎం నూతన కమిటీ నియామకం
- బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా గండికోట రాజు - November 18, 2026
- పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం – సర్పంచ్ ప్రసాద్ గౌడ్ - November 18, 2026
- కైలాసగుట్టపై రెండు హైమాస్ట్ లైట్లు ఏర్పాటు - November 18, 2026

జ్ఞాన తెలంగాణ,వెల్దండ: కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండల కేంద్రంలో బీజేవైఎం నూతన మండల కమిటీ నియామక కార్యక్రమం నిర్వహించారు. మండల అధ్యక్షుడు బాణావత్ అరుణ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.నూతన కమిటీ మండల ఉపాధ్యక్షులుగా ఏ. జగన్, కే. శరత్, ఎన్. గణేష్, ఎం. సైదులు, ప్రధాన కార్యదర్శులుగా టీ. వంశీ, కే. అంజనేయులు, కార్యదర్శులుగా ఎం. విష్ణు, ఎన్. కుమార్, ఎం. శివచారి, శివ, అధికార ప్రతినిధులుగా శ్రీకాంత్, రాము, టీ. శ్రీకాంత్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా నరేష్ చారి మాట్లాడుతూ యువ నాయకులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, యువతను పార్టీ వైపు ఆకర్షిస్తూ సంస్థాగత బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్, ఉపాధ్యక్షుడు రవి రాథోడ్, ఆమనగల్ మున్సిపల్ అధ్యక్షుడు కర్నాటి విక్రమ్ రెడ్డి, ప్రశాంత్ నాయక్, బీజేవైఎం మాజీ అధ్యక్షుడు రవి, బీజేపీ సీనియర్ నాయకుడు పులి, సునీల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
