MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మాదిగ మృతి పట్ల పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తీవ్ర దిగ్భ్రాంతి
- MRPS రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బ్యాతల శివశంకర్ మాదిగ మృతి పట్ల పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తీవ్ర దిగ్భ్రాంతి - October 19, 2026
- అక్రమాలపై అధికారుల పక్షపాత వైఖరి.. మెకిలలో వ్యక్తమవుతున్న నిరసనలు! - October 15, 2026
- జ్ఞాన తెలంగాణ’ కథనానికి స్పందన, - September 15, 2026
-కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు
-చేవెళ్ల ప్రాంతంలో ఉద్యమానికి తీరని లోటని ఆవేదన
ఎమ్మార్పీఎస్ (MRPS) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, నిబద్ధత కలిగిన ఉద్యమకారుడు బ్యాతల శివశంకర్ మాదిగ ఆకస్మిక మృతి పట్ల ఎమ్మార్పీఎస్ అధినేత, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గుండెపోటుతో ఇటీవల మరణించిన శివశంకర్ మాదిగ నివాసానికి గురువారం ఆయన స్వయంగా వెళ్లారు. రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలంలోని టంగటూరు గ్రామంలోని శివశంకర్ మాదిగ నివాసానికి చేరుకున్న మందకృష్ణ మాదిగ.. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా శివశంకర్ మాదిగ తల్లిదండ్రులు, భార్యాపిల్లలను ,కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన మృతికి గల కారణాలను కుటుంబ సభ్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ఎమ్మార్పీఎస్ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు.
అనంతరం మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఎంతో క్రియాశీలకంగా, నిబద్ధతతో పని చేసిన శివశంకర్ మాదిగ అకాల మరణం చేవెళ్ల ప్రాంత ఉద్యమానికి తీరని లోటని కొనియాడారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగల్ల ఉపేందర్ మాదిగ, ఎంఎస్పీ (MSP) జిల్లా మాజీ అధ్యక్షులు రావుగళ్ళ బాబు మాదిగ, ఎమ్మార్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ల నర్సింహా మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు కాడిగాళ్ల ప్రవీణ్ కుమార్ మాదిగ, శంకరపల్లి మండల అధ్యక్షుడు లింగం సాయి మాదిగ, చేవెళ్ల మండల అధ్యక్షులు మల్లేష్ మాదిగ, మొయినాబాద్ మండల అధ్యక్షులు కుమార్ మాదిగ, షాబాద్ అధ్యక్షులు ముల్కి ప్రవీణ్ మాదిగ తదితర నాయకులు పాల్గొన్నారు
