Author: Dubbaka Srinivas

బైక్ దగ్ధం

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి కాకలగుట్ట తండా గ్రామ శివారులో శనివారం ఘటన జరిగింది. గ్రామానికి చెందిన భూక్య గణేష్కు చెందిన ఎట్రిక్ ద్విచక్ర వాహనం షార్ట్‌లక్‌తో దగ్ధమైంది. కూరగాయలు అమ్మేందుకు వెళ్తుండగా వాహనం నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో అప్రమత్తమైన భూక్య గణేష్ పక్కకు తప్పుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో బ్యాటరీ వాహనం పూర్తిగా దగ్ధమైంది.

రోడ్డు ప్రమా

రోడ్డు ప్రమాదం.. దంపతులకు గాయాలుకామారెడ్డి జిల్లా బిక్కనూర్ సమీపంలోని లక్ష్మీనగర్ తండా జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ ఎక్సెల్పై కామారెడ్డి వైపు వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరి తీవ్ర గాయాలు. స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.

ఇందిరమ్మ ఇళ్

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సూచనలుకామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం సర్పంచ్ సుధారాణి బాపురెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో నిర్మించుకోవాలని తెలిపారు. శనివారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముగ్గు పోశారు. అనంతరం లబ్ధిదారులకు దరఖాస్తు పత్రాలు. ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

కల్తీ కల్లుప

కామారెడ్డిలో కల్తీ కల్లుపై ఎక్సైజ్ శాఖ తనిఖీలుకామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని 2వ కల్లు డిపోతోపాటు దేవునిపల్లిలోని కల్లు దుకాణాల్లో ఎక్సైజ్ శాఖ సిఐ పోశెట్టి తనిఖీలు చేపట్టి, కల్లు నమూనాలను సేకరించి పరీక్షల కోసం తీసుకెళ్లారు. నమూనాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

చెక్కుల పంపి

వధూవరులకు రూ.2.50 లక్షల చెక్కుల పంపిణీకామారెడ్డి జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న వధూవరులకు ప్రభుత్వం ఆర్థిక రూ.2.50 లక్షల సహాయానికి సంబంధించిన చెక్కులను నేడు కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని, నూతన దంపతులు సంతోషంగా జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.

38 వ వార్డు లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన షబ్బీర్ ఆలీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కామారెడ్డి పట్టణంలోని 38వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ప్రమాదం లేదా మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక…

విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి: డా.చాగంటి

కామారెడ్డిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో గురువారం ఉదయం డా.చాగంటి కోటేశ్వర్ రావు విద్యార్థులను ఉద్దేశించి ప్రవచనాలు చేశారు. విద్యార్థులు ఆధ్యాత్మిక భావనతో పాటు సంస్కృతి సంప్రదాయాలను అలవర్చుకుంటూ, మానసికంగా శారీరకంగా దృఢపడాలని వివరించారు. అన్నింటి వరకు ఫోన్లకు దూరంగా ఉండాలని హితబోధ చేశారు. పుస్తక పఠనం ఎక్కువగా సూచించబడింది. పట్టణంలోని ప్రముఖులు, పాఠశాల సిబ్బంది ఉన్నారు.

ఉప్పరపల్లి: వరి కొయ్యలను కాల్చవద్దు: ఏవో నరేంద్ర

కామారెడ్డి జిల్లా పంట కోతల తర్వాత వరి కొయ్యలను కాల్చవద్దని బీబీపేట మండల వ్యవసాయ అధికారి నరేంద్ర సూచించారు. గురువారం ఉప్పరపల్లిలో కాల్చిన వారి కొయ్యలను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూసారం తగ్గిపోతుందని చెప్పారు. ప్రతి రైతు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని, వరి పంటలు సాగు చేయాలని సూచించారు.

ఎన్‌హెచ్-765డీపై ప్రమాదం.. వృద్ధుడు మృతి

కామారెడ్డి జిల్లా మహమ్మద్‌నగర్ మండలం నడిమి తండా వద్ద ఎన్‌హెచ్-765డిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కాట్రోత్ మేగ్యా (70) గురువారం మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 17న రాత్రి రహదారి దాటుతుండగా బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న గూడ్స్ వాహనం ఢీకొట్టింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ స్వగ్రామంలో కన్నుమూశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

చలో సిద్దిపేట పోస్టర్ విడుదల

చలో సిద్దిపేట సభను విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశం.దేశంలోనే తొలిసారిగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభంఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కామారెడ్డి నియోజకవర్గ ముఖ్య నాయకులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు, దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ మధుసూదన్ గారు పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా సభకు కామారెడ్డి నియోజకవర్గం…