పీఆర్టీయూ కి షాక్…!టీఆర్‌టీఎఫ్‌కు కొత్త బలం
- పీఆర్టీయూ కి షాక్…!టీఆర్‌టీఎఫ్‌కు కొత్త బలం - November 29, 2026
- విద్యా సేవలో చిరస్మరణీయం.. పూస నిర్మలకు ఘన సత్కారం - November 29, 2026
- విదేశీ ఉద్యోగాలకు భారీ సబ్సిడీ - November 27, 2026

రంగారెడ్డి,వెబ్ డెస్క్ :
పీఆర్టీయూ టీఎస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి వందలాది మంది ఉపాధ్యాయులతో టీఆర్‌టీఎఫ్‌లో చేరారు. కామారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి సభ్యత్వం అందజేసి స్వాగతించారు. అనంతరం రాష్ట్ర చీఫ్ అడ్వైజర్‌గా నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. ఆయన చేరిక సంఘ బలోపేతానికి దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ చేరికను రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కుషాల్ జామ, శంకర్‌పల్లి మండల అధ్యక్షుడు తలారి నర్సింలు స్వాగతించారు.
