బిలాల్పూర్: గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రేషన్ షాప్ నంబర్ 3711020 పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రేషన్ డీలర్ మొగులయ్య లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీతో రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.