రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) మైనార్టీ గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
డిమాండ్ చేసిన మైనారిటీ విభాగం అధ్యక్షులు బి.లింగ స్వామి, ప్రధాన కార్యదర్శి ఎం.మహేష్.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న తొమ్మిది మైనార్టీ గురుకులాలలో టీఎస్ యుటిఎఫ్ మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు విస్తృతంగా పర్యటించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.మైనార్టీ గురుకుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బి.లింగస్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సందర్శించిన ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు వారి యొక్క పూర్తి మద్దతును తెలియజేశారని,భవిష్యత్తు ఉద్యమాలలో వారి భాగస్వామ్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.గురుకులాల ఏర్పాటు మొదలు ఆది నుంచి ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతున్న సంఘంగా యుటిఎఫ్ ను అభివర్ణించారు. గురుకుల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడిని తగ్గించాలని, ఉపాధ్యాయులుకు ఈహెచ్ఎస్ సౌకర్యాన్ని కల్పించాలని,010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలనీ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.మహేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వమైనా,ప్రస్తుత ప్రభుత్వమైనా గురుకుల ఉపాధ్యాయుల పట్ల మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని వాపోయారు.పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి గురుకులాల పైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఉపాధ్యాయుల,విద్యార్థుల సంక్షేమానికి పాటుపడాలని హితువు పలికారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వారితోపాటు రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ఒల్లాల శ్రీనివాస్, ఎల్.చందర్ నాయక్,ఎన్.నారాయణ తదితరులు పాల్గొన్నారు.