అదుపుతప్పిన బైక్.. మంటల్లో పూర్తిగా దగ్ధం!

నసురుల్లాబాద్, నవంబర్ 24: నసురుల్లాబాద్ మండలం మైలారం శివారులో సోమవారం రాత్రి బైక్ ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చైతన్య రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి నసురుల్లాబాద్ నుంచి తిమ్మాపూర్‌కు బైక్‌పై వెళ్తుండగా మైలారం శివారులో ఈ ప్రమాదం జరిగింది. బైక్ కిందపడటంతో పెట్రోల్ ట్యాంకు ధ్వంసమై, రోడ్డుకు రాసుకోవడంతో నిప్పురవ్వలు చెలరేగి మంటలు అంటుకున్నాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి బైక్ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో చైతన్యకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు అతడిని నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

You may also like...