ప్రగతి స్కాలర్‌షిప్ 2026కు దరఖాస్తులు ప్రారంభం
- ప్రజల్లోనే ఉండాలి.. పథకాలే పార్టీకి బలం: బొల్లారం వెంకట్‌రెడ్డి - August 4, 2026
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చు బిగుస్తోంది - August 4, 2026
- యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం - August 4, 2026

అర్హులైన బాలికలకు ఏడాదికి రూ.50,000 ఆర్థిక సాయం
ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినుల కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (AICTE) ప్రగతి స్కాలర్‌షిప్–2026కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది ఎంపికైన విద్యార్థినికి రూ.50,000 ఆర్థిక సాయం అందజేస్తారు.
ఈ స్కాలర్‌షిప్‌కు డిగ్రీ మొదటి సంవత్సరం లేదా లేటరల్ ఎంట్రీ ద్వారా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక కుటుంబం నుంచి గరిష్ఠంగా ఇద్దరు బాలికలు మాత్రమే అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు.
దేశవ్యాప్తంగా మొత్తం 5,000 స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌కు 566, తెలంగాణకు 424 స్కాలర్‌షిప్‌లు కేటాయించారు. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి రాష్ట్రాల వారీగా ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఇతర స్కాలర్‌షిప్‌లు పొందుతున్న విద్యార్థినులు ఈ పథకానికి అర్హులు కారు. ఎంపికైన వారు ప్రతి సంవత్సరం NSP పోర్టల్‌లో రెన్యూవల్ తప్పనిసరిగా చేసుకోవాలి.
దరఖాస్తులు మరియు పూర్తి వివరాల కోసం:
🌐 https://scholarships.gov.in/All-Scholarships
