ఎర్రపహాడ్ KYCS నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
- ఆడబిడ్డల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా.. సుకన్య సమృద్ధి యోజనకు చేయూత - November 6, 2026
- తాడ్వాయిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్ - November 6, 2026
- తాడ్వాయిలో మేట్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం - November 6, 2026
తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో KYCS నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు శీతపల్లి అనిల్ కురుమ ఆధ్వర్యంలో నవంబర్ 5న నిర్వహించిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు చెట్కూరి రజినీకాంత్ కురుమ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అంబళ్ల సాయినిఖిల్ కురుమ, వ్యవస్థాపకులు చెట్టి భాస్కర్ కురుమ తదితరులు హాజరయ్యారు. కురుమ కుల ఐక్యత, సామాజిక అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. అధ్యక్షుడిగా బుయ్య భాను ప్రసాద్ కురుమ, ప్రధాన కార్యదర్శిగా ఇరుమ రంజిత్ కురుమ, ఉపాధ్యక్షుడిగా బుయ్య ప్రశాంత్ కురుమ, కోశాధికారిగా సొంటికే నందు కురుమ, కార్యదర్శిగా చెవిటి రంజిత్ కురుమ ఎన్నికయ్యారు. నూతన కమిటీకి నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
