రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత* — ఈ నెల 26న దౌల్తాబాద్‌లో సామాజిక సదస్సు

  సంగారెడ్డి :- భారత రాజ్యాంగంపై చర్చించి, యువతకు సామాజిక స్ఫూర్తిని అందించాలన్న సంకల్పంతో ఈ నెల 26వ తేదీ (గురువారం) ఉదయం 10:30 గంటలకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్‌లో ప్రత్యేక సామాజిక సదస్సు నిర్వహిస్తున్నట్లు సామాజిక ఉద్యమ నాయకులు మీనంపల్లి కిషన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. దళిత జర్నలిస్టుల ఫోరమ్ (హత్నూర మండల కమిటీ) ఆధ్వర్యంలో “77 ఏళ్ల భారత రాజ్యాంగం – బహుజనుల స్థితిగతులు” అనే అంశంపై ఈ సదస్సు జరగనుందని, దీనికి ప్రజలందరూ తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్వీయ హస్తాలతో వ్యవస్థీకరించిన ‘ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్’ జాతీయ చైర్మన్‌గా మూడు సార్లు సేవలందించిన విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రముఖ అంబేద్కర్ వాది ఎస్. చంద్రయ్య.
 సామాజిక హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పారం ప్రకాష్, హత్నూర మండల తహసీల్దార్ ఫర్హీన్ షేక్, జిన్నారం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి మరియు పలువురు బహుజన మేధావులు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వస్తున్నట్టు అయన తెలిపారు 
దేశ ఐక్యత, ప్రగతితో పాటు బడుగు బలహీన వర్గాల హక్కులు, సామాజిక భద్రత, న్యాయం, ఉపాధి, అందరికీ నాణ్యమైన విద్య మరియు వైద్యం అందాలన్నదే భారత రాజ్యాంగ ఆశయమని మీనంపల్లి కిషన్ రావు పేర్కొన్నారు. మారిన ఈ యాంత్రిక యుగంలో రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగార్చుతూ, తిరోగమన విధానాలతో సమాజంలో అభద్రతా భావాన్ని వ్యాప్తి చేస్తున్న శక్తులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన గురుతర బాధ్యత నేటి యువతపై ఉందని, అందుకే నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళా సంఘాలతో పాటు అభ్యుదయ, సామాజిక వాదులందరూ పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు.

Kondagalla Sridhar

I'm Sridhar kondagalla from Hathnoora vill., mdl., sangareddy dist I'm working as Reporter correspondent to Narsapur constituency at the paper of print & electronic media named Gnana telangana

You may also like...