ఆర్టీసీ బస్సు ఢీకొని మేస్త్రీ దుర్మరణం.. ఇద్దరు కుమార్తెలకు తీరని శోకం
- ఆర్టీసీ బస్సు ఢీకొని మేస్త్రీ దుర్మరణం.. ఇద్దరు కుమార్తెలకు తీరని శోకం - October 30, 2026
- అటవీ శాఖకు పోలీసుల పూర్తి సహకారం - October 28, 2026
- సెంట్రలైజ్డ్ కిచెన్ రద్దు చేయాలి.. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి - October 28, 2026
ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన బాన్సువాడ మండలంలో చోటుచేసుకుంది. కొత్తబాది గ్రామానికి చెందిన కుమ్మరి మహేష్ (40) మేస్త్రీ పనుల నిమిత్తం బుడిమి గ్రామానికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న మహేష్ మృతితో భార్య, ఇద్దరు కుమార్తెలు దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరవుతున్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
