మాందాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
- మాందాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం - October 30, 2026
- మండల ఎస్జీఎఫ్ టోర్నమెంట్లో ఆర్ఆర్ విద్యార్థుల ప్రభంజనం - October 30, 2026
- ఎలినో ప్రభావంతో ముందస్తు జాగ్రత్తలు… - October 29, 2026
కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని దోమకొండ సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి గారు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతి వరిధాన్యం గింజను కొనుగోలు చేస్తుందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాందాపూర్ గ్రామ సొసైటీ డైరెక్టర్లు చింతకుంట రాకేశ్ రెడ్డి, చింతాల నీరజ, శేషారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత రాజు, బీవీపేట్ సొసైటీ చైర్మన్ సుతారి రమేష్, సీవో మరియు ఏవో అధికారులు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ రైతులు, గ్రామస్తులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

