ప్రజల నమ్మకమే జర్నలిస్టులకు రక్షణ – ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

ప్రజల విశ్వాసాన్ని పొందినప్పుడే జర్నలిస్టులకు నిజమైన రక్షణ, గౌరవం లభిస్తుందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో కామారెడ్డి జిల్లా విలేకరులకు నిర్వహించిన పునశ్చరణ తరగతులకు ఆయన హాజరై మాట్లాడారు. కాలానుగుణంగా మీడియా రంగం అనేక మార్పులకు లోనవుతున్నప్పటికీ ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం వృత్తి కత్తిమీద సాములాంటిదని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వాస్తవాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఓఎస్‌డీ రెహమాన్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, కాసుల బాలరాజు, వై.కృష్ణారెడ్డి, వేణుగోపాల్, రజనీకాంత్, రాజేష్, శ్రీనివాస్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...