బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్
- బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ - October 15, 2026
- డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా - October 15, 2026
- ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు - October 15, 2026

ఆమనగల్లు అక్టోబర్ 13 :బతుకమ్మ, దసరా వేడుకల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రత కల్పించాలని ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పత్యనాయక్ కోరారు. ఈ మేరకు మంగళవారం తుక్కుగూడలో డీసీపీని కలిసి వినతిపత్రం అందజేశారు.ఆమనగల్లో నిర్వహించే బతుకమ్మ, దసరా వేడుకలు, జమ్మి పూజ, రావణ దహనం కార్యక్రమాలకు 20 వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణకు తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, మున్సిపాలిటీ నాయకుడు కండె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
