వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపే సంకల్పం..


జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,అక్టోబర్ 09:


వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపడమే తన సంకల్పమని, ప్రతి ఒక్కరికీ అండగా నిలవడమే లక్ష్యమని మాజీ డీసీసీబీ చైర్మన్, బాన్సువాడ నియోజకవర్గ నాయకుడు పోచారం భాస్కర్‌రెడ్డి తెలిపారు.నియోజకవర్గంలోని ప్రతి వికలాంగుడికి వారి అవసరాలకు అనుగుణంగా కృత్రిమ చేతులు, కాళ్లు, ఇతర సహాయక పరికరాలు అందించేందుకు మానవతా కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు.ఇందులో భాగంగా సెప్టెంబర్ 30న బాన్సువాడ పట్టణంలో ముగ్గురికి కృత్రిమ అవయవాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి విస్తరించునున్నట్లు వెల్లడించారు.అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ గ్రామాల్లోని వికలాంగుల ఇళ్లకు వెళ్లి వారి పూర్తి వివరాలు, ఫోన్ నంబర్, అంగవైకల్యానికి కారణం, అవసరమైన సహాయక పరికరాల వివరాలను సేకరించి అందించాలని విజ్ఞప్తి చేశారు. దసరా అనంతరం మండలాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా కృత్రిమ అవయవాలు పొందలేక ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనివ్వడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఒక్క అర్హుడు కూడా సహాయానికి దూరం కాకుండా నాయకులు,ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని కోరారు.

You may also like...