ఘనంగా ప్రెషర్స్ డే వేడుకలు
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 9, 2026
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది. - October 9, 2026

జ్ఞాన తెలంగాణ,నిజామాబాద్ జిల్లా, కోటగిరి:
కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ప్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలో మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం సందడిగా సాగింది. విద్యార్థినీ, విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. పాటలు, నృత్యాలతో సభా ప్రాంగణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. కళాశాల ప్రిన్సిపాల్ ఖైషర్ పాషా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు విద్యతోపాటు సాంస్కృతిక రంగాల్లోనూ రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
