మత్తుకు దూరంగా.. లక్ష్యాల వైపు అడుగులు!
- అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు… - October 9, 2026
- నీటి గుంతలో పడి రెండేళ్ల బాలుడు మృతి - October 9, 2026
- మంచాల గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగం జరిగింది. - October 9, 2026

జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి,అక్టోబర్ 09:
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని బాన్సువాడ ఎక్సైజ్ సీఐ లావణ్య సంధ్య పిలుపునిచ్చారు. మేరా యువ భారత్, ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో నైబర్‌హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో భాగంగా నశా ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ లావణ్య సంధ్య మాట్లాడుతూ.. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి జీవితాన్ని నాశనం చేయడంతో పాటు కుటుంబాన్ని, సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. మత్తు పదార్థాల అక్రమ వినియోగంపై ప్రభుత్వం కఠిన చర్యలు, శిక్షలు అమలు చేస్తోందని తెలిపారు.నశా ముక్త్ భారత్‌పై నిర్వహించిన నినాదాల కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు, అతిథులు, అధ్యాపకులతో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఐ. గంగాధర్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సునిల్ రాథోడ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
