డొంకి చంద్రమౌళి కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం

వెల్దండ, అక్టోబర్ 9: వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి గ్రామానికి చెందిన డొంకి చంద్రమౌళి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి, పోతేపల్లి సర్పంచ్ తగుళ్ల కొండల్ యాదవ్ శుక్రవారం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం కుటుంబానికి రూ.3,000 ఆర్థిక సాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఎగిరిశెట్టి శివ, ఉడుత శివతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.1001247848.jpg

You may also like...