మృతుల కుటుంబాలకు గోలి ఆర్థిక సహాయం అందజేత

1001247714.jpg

వెల్దండ, అక్టోబర్ 9: వెల్దండ మండలంలోని పోతేపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబాలకు అంజి మాస్టర్ అండగా నిలిచారు.తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మృతుల కుటుంబాలకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.పోతేపల్లి గ్రామానికి చెందిన డెంకి చంద్రమౌళి, లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మల్లెపాకుల ప్రశాంత్ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న అంజి మాస్టర్, వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చారు.ఒక్కో కుటుంబానికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు.ఈ కార్యక్రమంలో పోతేపల్లి ఉపసర్పంచ్ చలమల శారద బాలయ్య గౌడ్, వార్డు సభ్యుడు గోరేటి అశోక్ కుమార్,చిన్న సైదయ్య, రేషన్ డీలర్ వెంకటయ్య, శ్రీనివాసులు, పెరపాకుల గోపాల్, సాయిబాబు, అర్జున్, కొమ్ము భరత్, ఎగిరిశెట్టి ఎల్లాజీ, దేవదాస్, మల్లెపాకుల శేఖర్, దానయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...