ఈదమ్మబండ తండా ఆలయ భూమి పూజలో పాల్గొన్న కాంగ్రెస్ నేత జక్కుల చిన్న జంగయ్య యాదవ్
- నీటిపారుదల డీఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు – రూ.100 కోట్ల అక్రమాస్తులు.! - November 12, 2026
- మాట తప్పేది లేదు మడమ తిప్పేది లేదు -మాట నిలబెట్టుకున్న సుంకిరెడ్డి.! - November 12, 2026
- సర్పంచులకు ఓటు హక్కు ఇవ్వండి.! ప్రభుత్వానికి పోలేపల్లి సర్పంచ్ జంతుక వెంకటయ్య వినతి..! - November 12, 2026

వెల్దండ నవంబర్ 11:వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధి ఈదమ్మబండ తండాలో శ్రీశ్రీ దుర్గామాత సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి బుధవారం కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి అధ్యక్షుడు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, మండల అధ్యక్షుడు హరికిషన్ నాయక్, మాజీ ఎంపీపీ జయప్రకాశ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తూరి ఆంజనేయులు గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జక్కుల చిన్న జంగయ్య యాదవ్ మాట్లాడుతూ ఆలయాలు సమాజ ఐక్యతకు, శాంతికి ప్రతీకలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం అతిథులను కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ శంకర్ నాయక్, డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య, వాసవి క్లబ్ అధ్యక్షుడు ఆలంపల్లి కృష్ణ, చల్లా రాంరెడ్డి, గోపాల్ నాయక్, నేనావత్ శంకర్ నాయక్, మాజీ సర్పంచ్ అంజయ్య, కానుగుల వెంకటేష్, మండలి శ్రీనివాస్ యాదవ్, శివలాల్ నాయక్, రఘుపతి నాయక్, ఉప్పు మదన్ మోహన్ రావు, వార్డు సభ్యుడు నరేష్ తదితరులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ యువత పాల్గొన్నారు.
