గుండాలలో జక్కుల రాములు కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల పరామర్శ

1001190581.jpg

వెల్దండ, సెప్టెంబర్ 18: గుండాల గ్రామ సర్పంచ్ జక్కుల వెంకటయ్య తండ్రి జక్కుల రాములు మృతి చెందడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జక్కుల రాములు పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భూపతిరెడ్డి, వెల్దండ సర్పంచ్ మట్ట వెంకటయ్య గౌడ్, కంటోన్‌పల్లి సర్పంచ్ లక్ష్మణస్వామి, కాంగ్రెస్ నాయకులు రషీద్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మట్ట భరత్ గౌడ్, రఘూల్ తదితరులు పాల్గొన్నారు. జక్కుల రాములు ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని వారు ప్రార్థించారు.

You may also like...