వికారాబాద్ జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన గ్యాస్ సిలిండర్ల లారీ
- వికారాబాద్ జిల్లాలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. చెరువులోకి దూసుకెళ్లిన గ్యాస్ సిలిండర్ల లారీ - October 8, 2026
- అనంతగిరి ఘటన స్థలానికి చేరుకున్న మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు: - October 3, 2026
- MRO ఆఫీస్ ఆవరణలో ఉరేసుకున్న రైతు - October 3, 2026

వికారాబాద్లో తృటిలో తప్పిన పెను ప్రమాదం:వికారాబాద్ జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. లారీలో పెద్ద సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు ఉండటంతో ప్రమాద తీవ్రతపై ఆందోళన నెలకొంది. అయితే సిలిండర్లకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. లారీని చెరువులో నుంచి బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి, లారీ అదుపుతప్పడానికి కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.
