విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేసిన పాఠశాల ఉపాధ్యాయులు,స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్

వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గుర్తింపు కార్డులను అదే పాఠశాలలోఉపాధ్యాయులుగా పనిచేస్తున్న,స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్నాపూర్ శ్రీనివాస్ అందజేశారు.

ఒకవైపు ఉపాధ్యాయుడిగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ,మరోవైపు స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సామాజిక చైతన్యం, విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న శ్రీనివాస్ విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందజేయడం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విద్యార్థులకు గుర్తింపు కార్డులు అందించడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, బాధ్యతాయుత భావన పెంపొందించాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.పలువురు విద్యార్థులు వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుద్ధదేవ్,పరిగి మండల విద్యాశాఖ అధికారి అంజయ్య, సర్పంచ్ పోనిమోని మాణిక్యంమరియు ఏఏపిసి చైర్ పర్సన్ అనిత రాణి సీనియర్ ఉపాధ్యాయులు శరత్ బాబు,చంద్రశేఖర్, మధుసూదన్ రావు, షేక్ సాదిక్, కవిత, కరుణాకర్, మరియు ఎంఆర్సి శ్రీశైలం యాదవ్ పాఠశాల ఓఎస్ అనసూయ,విద్యార్థులు, తల్లిదండ్రులు, పెద్దలు పాల్గొన్నారు.

You may also like...