కేతకీ సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాణిక్ రావు

 ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామివారిని జహీరాబాద్ శాసనసభ్యులు  మాణిక్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆలయంలో నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవం, దీపారాధన, గంగా హారతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాణిక్ రావు పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు జగదీష్, గ్రామ సర్పంచ్ వినోద్ బాల్‌రాజ్, సర్పంచ్‌లు కృష్ణ, సోహెల్, జైపాల్ రెడ్డి, నాయకులు ఏజెస్ బాబా, నాగేష్ సజ్జన్, శ్రీను పటేల్, కేతన్, ప్రవీణ్, జగదీష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

You may also like...