కేతకీ అమృతగుండంలో గంగా హారతి

ఝరాసంగం: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం పార్వతీ సంగమేశ్వరుల కల్యాణాన్ని భక్తుల జయజయ ధ్వానాల మధ్య నిర్వహించారు. రాత్రి 8:15 గంటలకు ఆలయం వెనుక ఉన్న అమృతగుండంలో అర్చకులు గంగా హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ చంద్రశేఖర్, ఆలయ ఈవో శివరుద్రప్ప, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.ఉదయ శంకర్ పాటిల్, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు హన్మంత్ రావు పాటిల్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు

You may also like...