ఇంద్రేశం మున్సిపాలిటీలో వీధి కుక్కల దాడి
- రాహుల్‌కు అవమానం..
మోదీ క్షమాపణ చెప్పాలి - July 23, 2026 - రేపే ‘జననాయగన్’ విడుదల.. - July 22, 2026
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో గిల్‌కు అగ్రస్థానం చేరువ - July 22, 2026

– ఐదు వీధి కుక్కల దాడిలో శివ (5) అనే బాలుడికి తీవ్ర గాయాల
– స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలింపు
జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, ఫిబ్రవరి 6 :
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల దాడి ఘటన కలకలం రేపింది. శివ (5) అనే బాలుడిపై ఐదు వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి తీవ్రంగా గాయపడిన బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం బాలుడిని పటాన్ చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల సంఖ్య పెరగడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణపై మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
