రేపు స్వదేశానికి ఎమ్మెల్యే కాలే యాదయ్య.. ఘన స్వాగతానికి పిలుపు
- సోనియాకు కోర్టు ఝలక్! - September 21, 2026
- ప్రెస్ అకాడమీ చైర్మన్‌కు ఘన సత్కారం - September 21, 2026
- రక్షణ లేని ఆర్టీసీ బస్‌స్టేషన్.. దొంగలకు అడ్డాగా వికారాబాద్ బస్టాండ్ - September 21, 2026

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విదేశీ పర్యటన ముగించుకుని రేపు స్వదేశానికి చేరుకోనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకాలని శంకర్‌పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొల్లారం వెంకటరెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించే స్వాగత కార్యక్రమానికి శంకర్‌పల్లి మండలంతో పాటు చేవెళ్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఎమ్మెల్యే కాలే యాదయ్యకు ఘన స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీ ఐక్యతను చాటాలని వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు.
