నార్సింగిలో అధికారులతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కీలక సమీక్ష: అభివృద్ధి పనుల వేగవంతానికి ఆదేశం

నార్సింగి: రాజేంద్రనగర్ శాసనసభ్యులు శ్రీ టి. ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో నార్సింగి సర్కిల్-45 కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీ అమిత్ నారాయణ (IAS) తో కలిసి ఎమ్మెల్యే ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పలు పెండింగ్ అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ముఖ్యంగా రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా మెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో డిసి లక్ష్మారెడ్డి, జలమండలి (HMWSSB) ఉన్నతాధికారులు మరియు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు
.
