న్యూ ఢిల్లీలో ఘనంగా ప్రారంభమైన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2026)

308971.jpg

న్యూ ఢిల్లీ: ఆసియాలోనే అతిపెద్ద టెక్నాలజీ ఫోరమ్ అయిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC 2026) 10వ ఎడిషన్ న్యూ ఢిల్లీలోని ద్వారకలో గల యశోభూమి (IICC) కన్వెన్షన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 7 నుండి 10 వరకు జరిగే ఈ నాలుగు రోజుల సదస్సు ఈసారి "Scale Without Boundaries" (సరిహద్దులు లేని విస్తరణ) అనే ప్రత్యేక థీమ్‌తో నిర్వహిస్తున్నారు.

భారత సాంకేతిక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా మరియు పెమ్మసాని చంద్రశేఖర్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 5G, 6G సాంకేతికతలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ వంటి సరికొత్త ఆవిష్కరణలను ఈ సదస్సులో ప్రదర్శిస్తున్నారు.

You may also like...