హైదరాబాద్‌లో ఇండీ కూటమి ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీలో ఉద్రిక్తత.. పలువురు నేతల అరెస్ట్‌

308844.jpg

హైదరాబాద్‌లో ‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో ఇండీ కూటమి నిర్వహించిన ‘చలో లోక్‌భవన్‌’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి లోక్‌భవన్‌ వరకు కూటమి నేతలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు.

ఈ ర్యాలీలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అజారుద్దీన్‌, శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

లోక్‌భవన్‌ వద్దకు ర్యాలీ చేరుకున్న సమయంలో పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి నేతలను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కూటమి నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్‌, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, వేం నరేందర్‌రెడ్డి తదితరులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని డీసీఎంలో తరలించారు.

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియపై ఇండీ కూటమి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా ‘సేవ్‌ డెమోక్రసీ’ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అక్టోబర్‌ 2 నుంచి 8 వరకు నిరసనలు చేపట్టాలని కూటమి గతంలో కార్యాచరణ రూపొందించిం

ది.

You may also like...