గాయత్రి దేవి అవతారంలో అమ్మవారు దర్శనం – భక్తులతో కిటకిటలాడిన దుర్గాదేవి మండపాలు

1001257721.jpg

వెల్దండ:మండల కేంద్రంలోని బుధవార్‌పేట ఆంజనేయస్వామి దేవాలయం,పాండురంగ నాయకస్వామి ఆలయాల్లో సోమవారం దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అల్లంపల్లి కృష్ణ, కార్యదర్శి పాలాది సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెల్దండ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్,డీసీసీ ఉపాధ్యక్షుడు యెన్నం భూపతిరెడ్డి, ఎస్సై యుగంధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాలతో సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, బాణవత్ శంకర్ నాయక్, ఎండీ రషీద్, కొయ్యల పుల్లయ్య, ఉప్పు ఆంజనేయులు, మట్ట మదన్ గౌడ్, పూరి వజ్రలింగం, కుమారస్వామి, సంతోష్, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...