రెడ్ క్రాస్ చైర్మన్ కు జూపల్లి భాస్కరరావు అభినందనలు

1001218213.jpg

నాగర్ కర్నూల్ : మహబూబ్నగర్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జై ప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ కేఎస్ రవికుమార్‌ను ప్రముఖ వ్యాపారవేత్త,బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.తన ఎన్నిక సందర్భంగా జూపల్లి భాస్కర్‌రావు అందించిన సహకారానికి కేఎస్ రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తన ఆధ్వర్యంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి మేలు జరిగేలా కృషి చేయాలని జూపల్లి భాస్కర్‌రావు ఆకాంక్షించారు.

You may also like...