సత్యశోధక్ సమాజ్ దినోత్సవ శుభాకాంక్షలు

రాష్టపిత జోతిబా ఫూలే 1873 సెప్టెంబర్ 24 న సత్యశోధక్ సమాజ్ ను స్థాపించారు. ఇది ఎంత శక్తివంతమైనది అంటే. ఈ సామాజిక వ్యవస్థపై పూర్తి ఆధిపత్యం కలిగి ఉన్న బ్రాహ్మణ భావజాలం ఉలిక్కిపడి లేచి ఆర్యసమాజ్ స్థాపించ వలసి వచ్చినంత.అప్పటికి శూద్రులు గా "ఇప్పుడు OBC,SC,ST లు గా సుమారు 6,743 కులాలుగా ఉన్నారు. సత్యశోధక్ సమాజ్ లక్ష్యం ఈ వ్యవస్థ లో బ్రాహ్మణ భావజాలం తెచ్చిన కుల విభజన, మరియు బ్రాహ్మణ భావజాలం మనపై నిర్దయగా రుద్దిన మానవ హక్కుల నిషెధం( విద్య, ధనం, ఆయుధం పట్టడం నిషేధం) మొదలైన వాటి పై తిరుగుబాటు. మానవ హక్కుల నిరాకరణ తో కూడుకున్న సత్యదూరమైన ఆచారాలు, పడికట్లను నిశితంగా పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చి మన ప్రజలను సత్యశోధనకు సమాయత్తంజేయడం.

ఈ లక్ష్య సాధనకు ఫూలే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు…తన భార్య సావిత్రి బాయి ఫూలే కు ప్రధాన పాత్ర ఇచ్చారు…ఇందులో బిసి, ఎస్సీ, ఎస్టీ లకు మాత్రమే సభ్యత్వం ఇచ్చారు…కొన్ని వేల సమావేశాలు నిర్వహించి కులాలను మనలను విడదీయడానికే ఏర్పాటు చేసారని, మనమంతా ఈ దేశ మూలవాసులమని…ఒకే రక్తం, ఓకే జాతి అని ప్రచారం చేశారు…

కులాలను కుప్పకూల్చాలని…మనమంతా ఒకే జాతిగా కలిసుండాలని ఆకాంక్షించారు…

వేల కులాలు గా శత్రువు చే విభజించబడిన మనమంతా రక్తసంబంధీకులమని, కలిసి పనిచేయాలని చెప్పారు..‌

ఆర్యులే( బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య) మన శత్రువులని తెలుసుకోవాలని స్పష్టంగా చెప్పారు…

మనలను బానిసలుగా చేసిన ఈ వ్యవస్థనుండి బయటకు రావాలని స్పష్టం చేశారు.

5 వేల సంవత్సరాల క్రితం సింధులోయ నాగరికత నిర్మాతలయిన మనం ప్రపంచానికే నాగరికత నేర్పామని అటువంటి నాగరికతకు మనం వారసులమని…మనకు వైభవోపేతమైన గతం ఉందని…ఈ సత్యాన్ని గ్రహించాలని కోరారు…

మన దేశంలో మనం మన గత వైభవాన్ని పునరుద్ధరించి, ఏ వ్యవస్థ కూ బానిసలుగా బ్రతక కుండా ఆత్మగౌరవంతో మన హక్కులు సాధించుకొని గర్వంగా బతుకుదాం…

ఫూలే సత్యశోధక్ సమాజ్ సాక్షిగా పునరంకితమవుదాం….1001341029.jpg

You may also like...