పిల్లల సృజనాత్మకత శారీరక ఎదుగుదలపై అవగాహన
- బతుకమ్మ దసరా ఉత్సవాలకు పటిష్ట భద్రత కల్పించాలి.. మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ - October 15, 2026
- డిండి ఎత్తిపోతల పథకం ఈనెల 17న మహాధర్నా - October 15, 2026
- ఆలయ నిర్మాణానికి లక్ష రూ.విరాళం..భక్తితో ముందుకొచ్చిన మండేగుత్తల కుటుంబ సభ్యులు - October 15, 2026
పిల్లల సృజనాత్మకత, శారీరక ఎదుగుదలపై అవగాహన.
జ్ఞాన తెలంగాణ, కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 29: కల్వకుర్తి మండలం లోని రాచాలపల్లి గ్రామంలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం వర్క్షాప్, అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో 1, 2వ తరగతుల విద్యార్థులు, వారి తల్లులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు జ్ఞానాన్ని పెంపొందించడం, తల్లులు పిల్లలతో అనుబంధాన్ని పెంచుకోవడం, డ్రాయింగ్ వంటి సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. పిల్లల శారీరక ఎదుగుదలకు ఆటలు ఎంతో అవసరమని, స్థూల, సూక్ష్మ కండరాల అభివృద్ధికి ఆటలు దోహదపడతాయని వివరించారు.అలాగే 3 నుంచి 5వ తరగతులు, 6 నుంచి 8వ తరగతుల విద్యార్థులను కమ్యూనిటీ క్లబ్లుగా ఏర్పాటు చేసి వాలంటీర్ల సహకారంతో చదువుకునే విధానంపై కూడా అవగాహన కల్పించినట్లు మండల కో-ఆర్డినేటర్ నజీమా బేగం తెలిపారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జగ్గయ్య, ప్రథమ్ సంస్థ జిల్లా కో-ఆర్డినేటర్ పర్వతాలు, మండల కో-ఆర్డినేటర్ నజీమా బేగం, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
