కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన చెరుకూరు నేతలు

పబ్బు బాలయ్య కుటుంబానికి రూ.27,500 ఆర్థిక సాయం అందజేత

వెల్దండ: కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త పబ్బు బాలయ్య మృతి పట్ల చెర్కూర్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, కష్టకాలంలో తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. మానవత్వంతో స్పందించి కుటుంబానికి రూ.27,500 ఆర్థిక సాయం అందజేశారు.కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన కార్యకర్త కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతగా భావించి ఈ సాయాన్ని అందించినట్లు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే నిజమైన మానవత్వమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మార్కెట్ డైరెక్టర్ చెర్కా రాజశేఖర్‌తో పాటు గాండ్ల చంద్రమౌళి, భీమరాజు, కాటిక లక్ష్మయ్య, పబ్బు కిష్టయ్య, ఎర్ర నరసింహ, సామ బలరాం, పబ్బు అంజయ్య, కేశమోని కృష్ణయ్య, యాదయ్య, బ్రహ్మం, బాలస్వామి, రమేష్, రాఖి రమేష్, బుర్ర బాలకృష్ణ, అల్లె ఆంజనేయులు, చంద్రయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.1001255144.jpg

You may also like...