పేద కుటుంబానికి సీఎం సహాయనిది అండ – 60 వేల చెక్కు అందజేత

వెల్దండ :వెల్దండ మండలం చెర్కూర్ గ్రామానికి చెందిన చెన్నారం కిరణ్‌కు మంజూరైన రూ.60 వేల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును కల్వకుర్తి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేర్క రాజశేఖర్ అందజేశారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సీఎం సహాయనిధి మంజూరైందని రాజశేఖర్ తెలిపారు. పేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం భరోసానిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భీమరాజు, వెంకటయ్య, కిష్టయ్య, సామ బాలరాం, బుర్ర బాలకృష్ణ, విజయేంద్రచారి, చంద్రమౌళి, బాలస్వామి, బొజ్జయ్య, శివ, శ్రీనివాస్, వెంకటయ్య, పప్పు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.1001199564.jpg

You may also like...