కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బాకీలు చెల్లించాలని బీఆర్ఎస్ ప్రజావాణిలో ఫిర్యాదు
- బాధిత కుటుంబానికి నాగర్ కర్నూల్ డీసీసీ కార్యదర్శి పరామర్శ - September 7, 2026
- కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి బాకీలు చెల్లించాలని బీఆర్ఎస్ ప్రజావాణిలో ఫిర్యాదు - September 7, 2026
- అక్రమ అరెస్టులతో ధర్మపోరాటాన్ని ఆపలేరు.. బీజేవైఎం - September 7, 2026
వెల్దండ సెప్టెంబర్ 07: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సిన బాధ్యతను చెల్లించాలని వెల్దండ మండలంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బారాస పార్టీ అధిష్టానం,మండల పార్టీ అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి ఆదేశాలమేరకు మండల పరిషత్ కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణుల సమక్షంలోఎంపీడీవో సులోచనకు ప్రజా వాణిలో ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూ2500, విద్యార్థినిలకు స్కూటీలు,హామీ మేరకు రైతు భరోసా,నిరుపేద కూలీలకు ఆత్మీయ భరోసా, ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేలు ఇలా అన్ని హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హామీల అమలను నెరవేర్చాలని అడిగే బీఆర్ఎస్ కార్యకర్తల పైన తప్పుడు కేసులను బనాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేసులను కోసం లేని పక్షంలో రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి విజితా రెడ్డి, మండల పార్టీ మాజీ అధ్యక్షులు జోగయ్య, మాజీ ఎంపీటీసీలు లింగం, నిరంజన్,ప్రధాన కార్యదర్శి నిరంజన్, ప్రభాకర్, ముక్తాల శేఖర్, హనుమంతు నాయక్, అంజి మాస్టర్, యువ నాయకుడు గండికోట రాజు, పోలె అశోక్, జంగిలి ఆనంద్, ప్రవీణ్, వెంకటయ్యలతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
