రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) మహిళపై లైంగిక దాడి కేసులో జిమ్ కోచ్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
రెండేళ్లకు పైగా వేధింపులు, బెదిరింపులు.. నిందితుడికి రూ.8 వేల జరిమానా
సైబరాబాద్ పరిధిలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో 2017లో నమోదైన మహిళపై లైంగిక దాడి, వేధింపుల కేసులో నిందితుడు మహమ్మద్ మౌజమ్ అలీ (39)కి ఎల్బీనగర్‌లోని రంగారెడ్డి జిల్లా 13వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.8 వేల జరిమానా విధించింది. గచ్చిబౌలిలోని రాంకీ టవర్స్ జిమ్‌లో ఫిట్‌నెస్ కోచ్‌గా పనిచేసిన నిందితుడు 2015 నుంచి మహిళను లైంగికంగా వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడినట్లు కేసు నమోదైంది. 2017 ఫిబ్రవరి 15న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలు సేకరించి చార్జిషీట్ దాఖలు చేశారు. ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి. మంజులాదేవి కృషితో శిక్ష ఖరారైనట్లు డీసీపీ క్రైమ్స్ వెల్లడించారు.
