రిపోర్టర్, మేడ్చల్-మల్కాజ్గిరి | 9966689865
Latest posts by Veeranna Yerra
(see all) మేడ్చల్ నియోజకవర్గం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తూర్కపల్లిలో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల (బాలురు) జూబ్లీహిల్స్, నాంపల్లి విద్యార్థుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను మంత్రి పొన్నం ప్రభాకర్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందిస్తాయని తెలిపారు. బీసీ గురుకుల విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను ప్రోత్సహించాలని, విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు.
